ఏలూరు పోలీసులను అభినందించిన సీఎం చంద్రబాబు
దొంగలించిన 251 ద్విచక్రవాహనాలను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ కేసులనను చేధించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షనీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన స్కూటర్ గతంలో చోరికి గురైంది. బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదలించాయని చంద్రబాబు అన్నారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరికి గురైతే ఆయా కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతాయన్నారు.













