ఐఎఎస్, ఐపిఎస్‌లకు చంద్రబాబు పాలనా పాఠాలు
ముస్సోరిలో శిక్షణపొందుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సంస్కరణలపై ఆయన మాట్లాడారు. విభజన అనంతరం ఎదురైన అవాంతరాలను అధిగమించిన సుస్థిర అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పారు. అభివృద్ధిలో సాంకేతికతకు పెద్దపీట వేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మించుకునే పనిలో ఉన్నామని, రాజధాని భవనాల కోసం పలు ఆకృత్తులను పరిశీలిస్తున్నామని అన్నారు. సాగు ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. కీలక సంస్కరణలు, నిర్ణయాలు త్వరితగతిన తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. సాంకేతిక వినియోగంపై వ్వవస్థలు ఆదారపడి పనిచేస్తున్నాయని వివరించారు.













