Chandrababu: మోడీకి రుణపడి ఉంటాం, చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజి ప్రకటించడం పట్ల సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీ కి చారిత్రక దినమన్నారు చంద్రబాబు. విశాఖ స్టీల్ కు కేంద్రం 11,440.కోట్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని.. ప్రధాన మంత్రికి (Narendra modi) ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, కుమార్ స్వామికి కృతజ్ఞతలు చెప్పారు. ఇది సమిష్టి కృషి వల్ల సాధ్యం అయ్యిందన్నారు సిఎం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యిందని తెలిపారు.
గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యంగా పని చేసిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని ఎన్నికల ముందు చెప్పామని స్టీల్ ప్లాంట్ కోసం చాలా పోరాటాలు చేసారన్నారు చంద్రబాబు. అర్ధరాత్రులు సమావేశాలు పెట్టామని కార్మికులు, అందరూ సమిష్టిగా పోరాడారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి చేసుకుందాం.. కార్మికులు అందరూ ముందుకు రావాలని కోరారు చంద్రబాబు. 7బిలియన్ మెట్రిక్ టన్నులు ఐరమ్ ఓర్ అవసరం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినవన్నీ ఒక్కోటిగా చేసుకుంటా వస్తున్నామని తెలిపారు.
అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామన్నారు చంద్రబాబు. పోలవరం డయాఫ్రమ్ వాల్ తిరిగి నిర్మాణం ప్రారంభిస్తున్నామని తెలిపారు. హెచ్సిఎల్, గూగుల్ డేటా సెంటర్స్ ఏర్పాటు కాబోతున్నాయని పేర్కొన్నారు. గ్రీన్ కో తో అతి పెద్ద ఎనర్జీ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఓర్వకల్లు, 50వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణమని పేర్కొన్నారు. కేంద్ర టూరిజం డిపార్ట్మెంట్ కూడా కోస్టల్ ప్రాంతంలో అభివృద్ధికి ముందుకు వచ్చిందని ఏపీ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేసారు. అభివృద్ధి, సమక్షంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. 4వ సారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని… ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని పేర్కొన్నారు. కేంద్ర పధకాలకు సంబందించిన నిధులు కూడా తెచ్చుకోలేకపోయారన్నారు. అన్ని సరి చేస్తాం..రాష్ట్రాన్ని గాడిలో పెడతామని పేర్కొన్నారు.













