వరల్డ్ సిటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో బిజీబిజీగా ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు ప్లీనరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాల ద్వారా నీటి వనరులు,
ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత సమచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా భూగర్భజలాలను పెంచగలిగామని చెప్పారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణకు సమర్థమైన పద్ధతుల్లో చేపడుతున్నామన్నారు. పునరుత్పాదాక ఇంధనంపై ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించారు.
హరిత రాజధాని అమరావతిలో సాంకేతిక పద్ధతులు వినియోగిస్తున్నామని అన్నారు. రాజధానిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు, సామాజిక అవసరాలకు 10, కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెస్ట్ అమలు చేస్తామని సమావేశంలో పేర్కొన్నారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామని తెలిపారు.













