సాయం లేకున్నా…అభివృద్ధి చేశా – చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి పెద్దగా సాయం రాకున్నా రాష్ట్రాన్ని అభివద్ధి చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాల్సిన బీజేపీ నేతలు కూడా కేంద్రం ఇంత ఇచ్చింది, అంత ఇచ్చింది అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలనూ కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగితే కొంత ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.













