Chandrababu; ఫైల్స్ క్లియర్ చేయరు, టెక్నాలజీ వాడరు, మంత్రులకు బాబు ట్రీట్మెంట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఇప్పుడు క్యాబినెట్ లో మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. క్యాబినెట్ విషయంలో చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల తర్వాత పక్కా లెక్కలతో కొత్త మంత్రులను తీసుకున్నారు. యువకులకు అలాగే విద్యావంతులకు క్యాబినెట్ల అవకాశం కల్పించారు. అయితే క్రమంగా కొంతమంది మంత్రుల వ్యవహార శైలిపై ప్రభుత్వ పెద్దల సీరియస్గా ఉన్నట్లు ఈ మధ్యకాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. నలుగురు మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నట్టు ఈ మధ్యకాలంలో పదేపదే వార్తలు వస్తూనే ఉన్నాయి.
చంద్రబాబు హెచ్చరించినా అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalian) హెచ్చరించినా, సీనియర్ నేతలు హెచ్చరించినా కొంతమంది యువ మంత్రుల విషయంలో మార్పు రావటం లేదు అనే ఒపీనియన్ వినపడుతోంది. కొత్త మంత్రులకు అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో తాను క్యాబినెట్ లోకి తీసుకుంటే ఫైళ్ళు భారీగా పేరుకు పోతున్నాయి అనే అసహనం చంద్రబాబులో ఉంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని మంత్రులు వినియోగించుకోవడం లేదు అనే అభిప్రాయంలో కూడా సీఎం ఉన్నారు.
ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులలో మార్పు రాకపోవడం, కనీసం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లకపోవడం పట్ల తెలుగుదేశం మంత్రుల విషయంలో సీఎం ఆగ్రహం తీవ్రస్థాయిలో ఉంది. దీనితో ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ఉద్వాసన పలకాలనీ చంద్రబాబు సిద్ధమయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా ఇప్పటికే సమాచారం వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అటు రాయలసీమ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు.
మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీసం నియోజకవర్గాలకు కూడా సదరు మంత్రులు వెళ్లడం లేదనే కోపం చంద్రబాబు నాయుడు లో ఉంది. దీనికి సంబంధించి పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడంతో ఇక క్యాబినెట్ నుంచి తప్పించాలనే అభిప్రాయంలో కూడా ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో కూడా చాలామంది మంత్రులు అలసత్వం ప్రదర్శించారు అనే విమర్శలు వచ్చాయి. స్వయంగా ఒక మంత్రికి స్పీకర్ అయిన పాత్రుడు క్లాస్ కూడా పీకారు. ప్రశ్నోత్తరాలు సమయంలో అసెంబ్లీ సమావేశాలకు త్వరగా రావాల్సి ఉన్న మంత్రులు దూరంగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం అయింది. అందుకే ఇప్పుడు క్యాబినెట్లో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దాదాపుగా ఫిబ్రవరిలో ఈ మార్పులు ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













