అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం : సీఎం చంద్రబాబు
అరకు కాఫీ (Araku Coffee) తోనే తనకు రోజు మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గొప్ప వారసత్వానికి అరకు కాఫీ ప్రతీకగా నిలుస్తోందన్నారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రయాణాన్ని పరిచయం చేశారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కాఫీ కప్పుల్లోకి చేరుతోందని తెలిపారు. అరకు ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి (International level) కాఫీ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందన్నారు. స్థానిక కాఫీ రైతులకు మరింత సాధికారిత కల్పించడంతో పాటు, ప్రపంచ కాఫీ పటంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.








