Chandrababu: నేను చెప్పేది వినండి, అమలు చేయండి
ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సమీక్షా సమావేశం రెండవ రోజు జరిగింది. జోన్-5 లోని శ్రీ సత్య సాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu).. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ జోన్లో హార్టికల్చర్ మరియు లైవ్ స్టాక్ అభివృద్ది చేస్తూ తలసరి ఆదాయాన్ని పెంచాలి. పంటల సాగు విషయంలో ప్రి హార్వెస్టింగ్ , హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ లో ఉత్తమ విధానాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
టెంపుల్(Temples) టూరిజనికి విస్తృత స్థాయిలో ఈ జోన్ లో అవకాశం ఉందన్నారు. నవంబర్ లో జరుగునున్న శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించే విధంగా చర్య చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను సకాలంలో పూర్తిచేయాలని స్పష్టం చేసారు. కర్నూలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ను వర్కౌట్ చేయాలన్నారు. కర్నూలు, అనంతపూర్, హిందూపూర్ ను ఇండస్ట్రియల్ జోన్ గా అభివృద్ధి పరచాలని సూచించారు. ఏపీలో ఐదు జోన్లు ఉన్నాయన్నారు. జోన్-1 లో విశాఖపట్నం, జోన్-2 లో రాజమండ్రి, జోన్-3 లో రాజదాని అమరావతి, జోన్-4 లో తిరుపతి, జోన్-5 లో అనంతపురం పవర్ హబ్‌లుగా ఉన్నాయని పేర్కొన్నారు.
పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని స్పష్టం చేసారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్ లోనూ ప్రత్యేకించి కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామన్నారు సిఎం. తాను చెప్పేదంతా జిల్లా కలెక్టర్లు అందరూ అర్థం చేస్తుకుని క్షేత్ర స్థాయిలో రియల్ టైమ్‌లో అమలుపరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.













