దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముగింపు పలకాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు: ట్విట్టర్ లో సీఎం చంద్రబాబు
ప్రధాని మోడీ రాజమహేంద్రవరం పర్యటనపై ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు- తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేకహోదాతో ఏపీని ఆదుకుంటామని చెప్పారు- ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి? – రాజధానిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని నీరు,మట్టి ముఖాన కొట్టారు- నల్ల ధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీ ఇచ్చారు- ఆర్ధిక నేరస్థులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచినవారిని దేశం దాటిస్తున్నారు- లక్ష కోట్లు ప్రజాధనాన్ని అపహరించిన వారికి అభయమిస్తున్నారు- ఇలాంటి వాళ్ళు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ – ప్రజాస్వామి వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కూలుస్తున్నారు- దేశానికీ, ప్రజాస్వామ్యానికి తీరనిద్రోహం చేశారు- దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముగింపు పలకాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు- కేంద్రంలో అధికార మార్పును రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు: ట్విట్టర్ లో సీఎం చంద్రబాబు













