భారత్ బయోటెక్ కు చంద్రబాబు అభినందనలు
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యానికి ఫోన్ చేసి అభినందనలు చెప్పానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధించినందుకు వారికి అభినందనలు చెప్పాను. ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన కృషి వల్లే బయోటెక్నాలజీ రంగంలో ఇంత పురోగతి సాధ్యమైందని, జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వారు నాతో చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్లో అప్పట్లో సైబరాబాద్ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి చేయబట్టే ఇప్పుడు దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదిగింది. హైదరాబాద్కు దీటుగా గ్రీన్ఫీల్డ్ నగరంగా అమరావతిని నిర్మించాలనుకున్నాం అని ఆయన తెలిపారు. రాజధాని ప్రజలను ఉద్దేశించి జూమ్ యాప్ ద్వారా ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.













