Chandrababu :పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యం… సీఐఐ వార్షిక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఢల్లీిలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనం (CII Annual Conference) లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్‌కి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు (PV Narasimha Rao) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.
ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. అమరావతి (Amaravati)లో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఇప్పుడు స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినస్ అంటున్నాను. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది. ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్ (Google) రాబోతోంది. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి. మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయి.రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (Innovation Hub) ఏర్పాటవుతోంది. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 7`8 ఏళ్లు సీఐఐ సదస్సులు నిర్వహించాం. మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చాను అని అన్నారు.













