ఢిల్లీ భేటీకి చంద్రబాబు దూరం
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జమిలి ఎన్నికల నిర్వహణపై ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అఖిలపక్ష భేటీ అజెండాలోని అంశాలపై పార్టీ తరపున ఒక లేఖ కేంద్రానికి రాయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలతో పాటు మిగిలిన పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నాకే జమిలి ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని టీడీపీ కోరనుంది. ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని లేఖలో కోరనున్నారు.













