రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తా
బ్యాడ్మింటన్లో మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్, దేశానికి మరింత పేరు తీసుకొస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్ పతకం సాధించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన ప్రశంసలు మరిచిపోలేనివని, ఆయన అందించిన సహకారంతోనే ఆటలో మెరుగ్గా ఆడుతున్నానన్నారు. నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు అని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని అన్నారు. ప్రస్తుతం తన కెరీర్ తొలి దశలోనే ఉందని, అందరి సహకారంతో మరింత ఉన్నత స్థాయి చేరుకుంటానని సింధు ఆశాభావం వ్యక్తం చేశారు.













