ఐఐఎం స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించారు. ఇందులో భాగంగా విశాఖలో జరుగుతున్న ఐఐఎం స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ లాజిస్టిక్ హబ్, పర్యాటక ప్రాంతమన్నారు. విశాఖలో అంతర్జాతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మేనేజ్మెంట్ కోర్సులకు ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. నైతిక విలువలు లేకపోతే విజయాలకు అర్థం ఉండదన్నారు. ఏ పనిలో అయినా నాయకత్వ లక్షణాలు ఉండాలని తెలిపారు. ఐటీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా విద్యార్థులు మారాలని సూచించారు. ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచయ్, ఇంద్రానూయి తదితరులు ఆ కోవకు చెందినవారే. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.













