Chandrababu : మంచి చేస్తే అభినందిస్తా.. తప్పు చేస్తే : చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చూపించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు (Surveys) చేయిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు (MLAs) మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. ప్రజలు అన్నీ గమనిస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అసమర్థ పాలనతో ఏపీని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు (MPs) , ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు ఉంటాయి. మంచి చేస్తే అభినందిస్తా. తప్పు చేస్తే దూరం పెడతా. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదు. ఈ నెల 12, లేదా 14 లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తాం అని చంద్రబాబు తెలిపారు.













