Chandrababu: చంద్రబాబుకు సరికొత్త శత్రువులు తయ్యారయ్యారా..?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గట్టి మద్దతుదారుగా కొనసాగుతున్నారు చంద్రబాబు. ఇటీవలే ఆపార్టీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం సైతం చేశారు. తెలుగుప్రజలు అధికంగా ఉన్నచోట్ల చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అందులో చాలా చోట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు కూడా. ఇది.. చంద్రబాబుకు మున్ముందు ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు ఏ పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ… జాతీయ రాజకీయాల్లో అందరు నాయకులకు సన్నిహితంగా మెసలేవారు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా…చంద్రబాబు ( Chandrababu) బిజెపికి దగ్గరయ్యారు. అంతేకాదు… బిజెపితో స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆకాశానికెత్తేస్తున్నారు. అంతేకాదు..ప్రపంచానికే విశ్వగురు అంటూ కీర్తిస్తున్నారు కూాడా.
ఈ పరిణామాలు జాతీయస్థాయిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రచారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ అదే అరవింద్ కేజ్రీవాల్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా చంద్రబాబు వెళ్లడంతో కొత్త శత్రువు తయారయ్యారు.
అయితే బిజెపి( Bhartiya Janata Party ) మూలంగా చంద్రబాబు జాతీయస్థాయిలో మిగతా పార్టీ నేతలకు దూరమయ్యారు. గతంలో ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవర్ వంటి నేతలతో పనిచేశారు. ఏపీ రాజకీయ అవసరాల మేరకు చంద్రబాబు తన వైఖరి మార్చుకున్న… ఆయనను మాత్రం తమ స్నేహితుడిగానే చూసేవారు జాతీయస్థాయి నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడం మాత్రం.. వారంతా వ్యతిరేకిస్తున్నారు.













