TDP Mahanadu: మహానాడు వేదికగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్ర బాబు ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఒక శుభవార్తను మహిళలకు అందించారు. ఆయన ప్రకటించిన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఎంతో ఆనందానికి గురి చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇక ఇప్పుడు వచ్చే ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel) కల్పించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఇప్పటివరకు ఈ సేవను కోసం మహిళలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. పండుగల సమయంలో మాత్రమే ఇలా ప్రయోగాత్మకంగా ఈ సేవల గురించి ప్రస్తావించినా, స్థిరంగా అమలు చేయలేదనే అభిప్రాయం ఉంది. అయితే, ఈసారి చంద్రబాబు స్వయంగా తుది తేదీ ప్రకటించడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మంత్రులు గతంలో కొన్ని తేదీలను ప్రకటించినప్పటికీ, అందులో స్పష్టత లేక మహిళల్లో ఆశాభంగం ఏర్పడింది. కానీ ఈసారి సీఎం నాయుడే (CM Naidu) తుది మాట పలకడంతో, మహిళలు నిజంగా ఈ సౌకర్యాన్ని పొందతారని భావిస్తున్నారు.
మహానాడు వేదికపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో శాంతిని పునరుద్ధరించామని, సంక్షోభ పరిస్థితులు తొలగిపోయాయని చెప్పారు. మహిళల కోసం చేపడుతున్న పథకాల గురించి వివరిస్తూ, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు (Free Gas Cylinders) అందిస్తున్నామని, తల్లికి వందనం పేరుతో పిల్లల చదువుకోసం తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని చెప్పారు. ఇది కాకుండా అన్నా క్యాంటీన్లు (Anna Canteens) మళ్లీ ప్రారంభించి పేదలకు తక్కువ ధరకు ఆహారం అందిస్తున్నామని చెప్పారు. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, స్కూళ్లు ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి భారీ అప్పులు ఉన్నా ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) పథకాలను అమలు చేస్తామని నమ్మకంగా చెప్పారు.
రాయలసీమను (Rayalaseema) హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అన్నదాతలకు న్యాయం చేయడం కోసం అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava)ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా తీసుకుంటున్న చర్యలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.