ఏపీ సర్కార్ పై కేంద్రం సీరియస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి విదితమే. ఏపీ రివర్స్ టెండరింగ్ అంటూ పట్టుబట్టడం, కేంద్రం వద్దని చురకలంటించడం మామూలైపోయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒకటి రెండు సార్లు లేఖలు అందాయి. అయితే, తాజాగా పోలవరంపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలనీ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల శక్తి శాఖ మరో లేఖ రాసింది. పోలవరంలో అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే, నిపుణుల కమిటీ నివేదికతో విభేదిస్తూ అక్రమాలు జరగలేదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ తేల్చింది.













