పోలింగ్లో కుట్ర చేశారుః సీఎం చంద్రబాబు
ఉదయం ఓటేద్దామని పోలింగ్ కేంద్రాలకు వెళితే ఈవీఎంలు పనిచేయలేదని ఫిర్యాదులు.
ఆరంభంలో 35 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఉదయం నేను అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను.
ఇది ప్రీ ప్లాన్డ్..
దీనికి సంబంధించిన కరస్పాండెన్స్ ముందే జరిగింది.
వయలెన్స్ చేయబోతున్నారు. జాగ్రత్తగా వుండమని ఈసీకి చెప్పాం.
మేము చెప్పినదేమీ పట్టించుకోకుండా సీనియర్ అధికారులందరినీ మార్చేశారు.
24 గంటల ముందు మార్చేశారు.
మేమే ఇష్టానుసారం చేస్తామని ఇండికేట్ చేశారు.
కడప ఎస్పీని మార్చారు. పనిచేసే వ్యక్తికి పనిష్మెంట్ ఇస్తే వారు పనిచేయగలుగుతారా
పోలింగ్ రోజున గల్లా జయదేవ్ మీద ఐటీ దాడులు చేశారు.
ఇష్టానుసారం చేశారు. ప్రజలు తెల్లారిలేచి దృఢ సంకల్పంతో వచ్చి ఓటేయడానికి బారులు తీరారు.
మహిళలు ఉదయమే స్నానం చేసి సిద్ధమై పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
ఇంతమందిని ఇంత ఉదయమే ఎప్పుడైనా చూశామా?
ఈవీఎంలు పనిచేయకపోతే మూడు సార్లు వెనక్కి వెళ్లి మళ్లీ వచ్చారు.
ఈసీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ సీఈవోనే ఓటేయలేకపోయారు. వెనక్కి వచ్చేశారు. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి
ఈవీఎంలు రీప్లేస్ చేశారు. ప్రజాస్వామ్య భవిష్యత్తు ఒక మిషన్ మీద వదలిపెట్టారు.
కరెంటు లేకపోతే మిషన్ పనిచేయలేదు.
మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తారా?
ఇది సబబేనా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాను.













