మీ సేవలు మరువలేనివి… వృథాపోవు
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో కష్టపడి పనిచేసిన వలంటీర్లను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మహానాడు వలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మూడు రోజులపాటు నిద్రహారాలు మాని సేవలందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ యువతదేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ఒంటెద్దు పోకడలను ఎదురించి నిలవాల్సిన బాధ్యత యువతదేనని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని సృష్టం చేశారు. మీ సేవలు మరువలేనివని, వృధా పోవంటూ అభినందించారు.













