పురుషోత్తపట్నం జాతికి అంకితం :చంద్రబాబు
రాబోయే మూడు నెలల్లో రూ.13వేల కోట్లతో 28 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అన్నారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాజెక్టుల మీద 44వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మెట్ట ప్రాంత రైతులు 40 సంవత్సరాల నుంచి చిరకాల వాంఛ అయిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా వుందని అన్నారు. ఏలేరు కాలువకు నీరు ఇవ్వడం ద్వారా అదనపు ఆయకట్టుకు నీరు అందించాలన్నది మెట్ట రైతుల ఆకాంక్షని అన్నారు. జిల్లాలో 31 లక్షల 2వేల 852 ఎకరాలు నిమిత్తం వుండగా వ్వవసాయ యోగ్యమైన భూమి 13 లక్షల 66వేల 362 ఎకారాలు వుందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల 11 జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని, దీని ద్వారా 33 టిఎంసిల నీరు కృష్ణ డెల్టాలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మిగిలిన అన్ని జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.













