గౌరవం దక్కే పార్టీలో చేరతా
గౌరవం దక్కే పార్టీలో చేరతానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక సీమ కోసం తాను చేసిన ఉద్యమాన్ని ప్రజలు సమర్థించలేదన్నారు. అందుకే పార్టీని మూసివేస్తున్నానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు మరో పార్టీలో చేరతానన్నారు. కర్నూలు జిల్లా ముచ్చమర్రిలో ఏర్పాటుచేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ విభజన తప్పదని తాను ముందుగానే హెచ్చరించినా ఎవరూ రాయలసీమ గురించి ఆలోచించలేదన్నారు. విభజన వల్ల సీమకు అన్యాయం జరుగుతుందనే ఏడేళ్ల క్రితం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించానన్నారు. ప్రజల మనుసుల్లో లేని సీమ ఉద్యమం కోసం తానొక్కడినే ఉద్యమించినా ఫలితం లేకపోవడం ఇక చేసేది లేక ఆర్పిఎస్ను మూసివేస్తున్నానని అన్నారు.













