అది తట్టుకోలేకే అరెస్ట్లు చేస్తున్నారు…

ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారని, అది తట్టుకోలేకే అరెస్ట్లు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. నియంతృత్వ పాలకులు చరిత్రలో రాణించలేదన్నారు. జగన్ అంత పిరికి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని విమర్శించారు. టీడీపీ మహానాడును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వటం లేదని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. మహానాడుకు నడిచి వచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహానాడుకు వచ్చే వారిని అడ్డుకుంటే టీడీపీ ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు.











































































