ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవ్వరికీ ఉపాధి, బతుకు తెరువు లేకుండా జగన్ చేస్తున్నారన్నారు. ధనం తినడం తప్పితే మరో లక్ష్యం లేదని, ధన దాహం వున్న రాక్షసుడు జగన్ అని అన్నారు. రెండు వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసి పేదలకు డబ్బులిస్తూ ఉద్దరిస్తున్నానని గొప్పలకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. పీకే సర్వేలో ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో 28 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు.











































































