ఈ ఘనత సీఎం జగన్‌దే.. ఏపీ, బీహార్‌ను

ఆంధ్రప్రదేశ్, బీహార్‌ను మించిపోయిందని, ఈ ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని టీడీపీ జనరల్ సెక్రటరీ బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనన్నారు. అన్ని ధరలూ మించి ప్రజలపై జగన్ భారం మోపారని ఆరోపించారు. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడ్డానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు. జగన్‌ను విజయ సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు కాబట్టే ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారని ఆరోపించారు. మద్యం షాపులు దగ్గర గూగుల్ పే ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎక్కడా లేని పన్నులు వేస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక రాక్షసుడా? అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని అన్నారు.











































































