ఆయన జోలికి వస్తే చంపడానికైనా.. చావడానికైనా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇస్టానుసారంగా మాట్లాడేవారి కోసం 100 మంది సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేసినట్లు ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో నిర్వహించిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. చెత్తవాగుడు వాగే వాళ్లకి ఈ హెచ్చరిక జారీ చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబం జోలికి వస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్‌పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీనియర్లను కాదని జోగి రమేష్‌కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతలే చెప్పారన్నారు. చంద్రబాబుపై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటే సహించేది లేదని వైసీపీని ఉద్దేశించిన ఆయన హెచ్చరించారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.











































































