ఫిబ్రవరి 6 నుంచి శ్రీశైలంలో బ్రహ్మూెత్సవాలు
శ్రీశైలక్షేత్రంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తోంది. తాత్కాలిక సదుపాయాల కల్పన ప్రారంభమయింది. ఇందులో భాగంగా ఆలయ మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా కంపార్ట్మెంట్లను విస్తరింపజేస్తున్నారు. చంద్రావతి కల్యాణమండపం నుంచి శివాజీగోపురం మీదుగా శివస్వాములు ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజులపాటు కొనసాగే బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసేందుకు దేవస్థానం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది.













