రాజధాని రైతులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్ సృష్టత ఇవ్వాలని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం నెలకొందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల కలల రాజధాని అని అన్నారు. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలన్నారు. ఇందుకు మంత్రి బొత్స సత్యానారాయణ జవాబు ఇచ్చారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి చెప్పారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రాజధానిని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నామని.. త్వరలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని బొత్స సృష్టం చేశారు.













