బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్యపై అత్యాచారం, హత్య కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో చంద్రభాన్ సవప్ను దోషిగా తేలుస్తూ ముంబయిలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం గతంలో విధించిన ఉరిశిక్షను సమర్థించింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడిపై మరణ శిక్ష సరైందేనని బాంబే ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 2015లో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షణను సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఆ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.













