టీడీపీ కోసం అమరావతిని బలిపెట్టొదు : జీవీఎల్
రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసీపీ యత్నిస్తోందని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా మూడు రాజధానులు అనడం తప్పని అన్నారు. ఆ తీర్పును దిక్కరించేలా వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా మూడు రాజధానులు లాంటి వేరే ప్రస్తావన చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేసే సత్తా ఉంటే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని అన్నారు.













