రెండ రోజుల్లో తేల్చండి.. లేదంటే నా శవాన్నే చూస్తారు
కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఉక్కు పరిశ్రమ ముగిసిన అధ్యాయం కాదని, ముందు దీక్ష విరమించాలని బీరేంద్రసింగ్ కోరారు. దీనికి సీఎం రమేష్ ఉద్వేగంగా స్పందిస్తూ మీరు ఇక్కడికి వచ్చి ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తా నని సమాధానమిచ్చారు. 2 రోజుల్లో ఉక్కుపై సృష్టమైన నిర్ణయం తీసుకోకపోతే తన శవాన్ని చూడాల్సి వస్తుందని కూడా కేంద్ర మంత్రికి ఆయన సృష్టం చేశారు. ఈ మాట అంటున్నప్పుడు ఉద్వేగానికి లోనైన సీఎం రమేష్ కళ్లలో నీళ్లు తిరిగే సరికి అక్కడున్న తెలుగుదేశం నేతలు కూడా చలించారు. బీరేంద్రసింగ్ నుండి ఫోన్ రాగానే, ఉక్కు పరిశ్రమ స్వయంగా తనకే హామీ ఇస్తారని ఆశించిన రమేష్, ఆయన నుండి అటువంటి నిర్ణయం ఏదీ లేకపోగా దీక్ష విరమించాలని కోరడంతో నిరాశ చెందారు.













