ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీకి రండి : భావన సక్సేనా
ఆర్థిక ప్రగతి, వాణిజ్య పురోభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ప్రత్యేక కమిషనర్ భావన సక్సేనా పిలుపునిచ్చారు. ఇండియన్ కన్ట్స్రక్షన్ వరల్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో న్యూ ఢిల్లీలో జరుగుతున్న భారత నిర్మాణరంగ ఉత్సవాలు-2018 రెండవరోజు కార్యక్రమంలో ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏపీ ఆర్థిక అభివృద్ధి, మౌలిక వనరులు, పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.













