Somu Veerraju:ఆయన మాటలు నమ్మిన పీఎస్ఆర్ పరిస్థితి ఏమైంది? : సోము వీర్రాజు
మాజీ సీఎం జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు (Police), ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఏమాత్రం సరైంది కాదన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి, జగన్ (Jagan) ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీడియా (Media) సమావేశాల్లో జగన్ పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు నమ్మిన పీఎస్ఆర్ ఆంజనేయులు పరిస్థితి ఏమైంది? నారా లోకేశ్ (Nara Lokesh)ను పాదయాత్రలో ఎంతో ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతో పురోగతి సాధించాయి అని అన్నారు.













