భానుకిరణ్ కు యావజ్జీవం
ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసుపై నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో మరో నిందిడుతు మన్మోహన్సింగ్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.
మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హైదరాబాద్లోని నవోదయ కాలనీలో హత్యకు గురయ్యారు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్ తుపాకీతో కాల్చి పరారయ్యాడని మధుమోహన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు మొదట బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురకిఇ నాంపల్లి కోర్టు శిక్షను ఖారారు చేసింది. కోర్టు తీర్పుపై సూరీ సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు.













