వాళ్లకు జగన్ నుంచి సమస్య రాక ముందే అలెర్ట్ అయితే బెస్ట్…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎమ్మెల్యేలు పనులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పార్టీ కూడా అధికార పార్టీని అన్ని విధాలుగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి.
కాబట్టి కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఎక్కువగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిశీలించి జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా చూస్తే భారీగానే అమలు చేస్తున్నారు. కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
కానీ ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎన్ని విధాలుగా చెప్పినా సరే కొంతమంది తీరులో మార్పు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచారం నిర్వహించాలని జగన్ చాలామందికి చాలా విధాలుగా చెప్పినట్టుగా కూడా తెలిసిందే. అయినా సరే 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాలంటీర్ల మీద బాధ్యత వదిలేశారని కూడా ఆరోపణలు వినబడుతున్నాయి.
వాలంటీర్లకు సంక్షేమ కార్యక్రమాలను అన్ని విధాలుగా అందించే విధంగా వాళ్లకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం మినహా ఇప్పుడు ఎమ్మెల్యేలు పెద్దగా జోక్యం చేసుకునే పరిస్థితి కనపడటం లేదని ఎంపీలు కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు అని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కొన్ని విషయాల్లో కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
నియోజకవర్గాల్లో ప్రజల్లో తిరగని నాయకుల విషయంలో ఆయన చూసి చూడనట్టుగా వ్యవహరించే అవకాశం దాదాపుగా లేదు అని అంటున్నారు. ఇతర పార్టీలతో స్నేహం చేసే వారి విషయంలో కూడా జగన్ చూసి చూడనట్టుగా వ్యవహరించే అవకాశం ఉండకపోవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు.













