Rammohan Naidu: ఈ ప్రమాదంపై విదేశీ మీడియా .. అసత్య ప్రచారం : రామ్మోహన్ నాయుడు
ఇటీవల అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఘరో విమాన ప్రమాదం పై రాజ్యసభ (Rajya Sabha) లో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) సమాధానమిచ్చారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. అహ్మదాబాద్ (Ahmedabad)లో చోటుచేసుకున్న ఎయిరిండియా (Air India) విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం. తుది నివేదిక వచ్చాకే దీనిపై మరిన్ని వివరాలు తెలుస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రమాదంపై ఏఏఐబీ (ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేషన్ బ్యూరో) పారదర్శకంగా దర్యాప్తు జరుపుతోంది.
కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా (media) అసత్య ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపడతారు. అంతర్జాతీయ ప్రొటోకాల్(Protocol) కు అనుగుణంగానే దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని అన్నారు.







