విశాఖ నగరానికి అన్ని అర్హతలు : అవంతి

పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనవాసరావు తెలిపారు. ఆయన భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ.4.5 కోట్ల అభివృద్ధి పనులకి శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ రోజు 4.5 కోట్లతో మధువాడ ప్రాంతంలో అభివృద్ధి పనులకి శంఖుస్థాపనలు చేశాం. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అభివృద్ధి చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. విశాఖ నగరం 2019 కి ముందు ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు నృష్టంగా గుర్తిసారు. ఎయిర్పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్.. ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం. అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం అన్నారు.











































































