Mannava Mohanakrishna :రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి… ప్రవాసాంధ్రులకు ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ పిలుపు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ (Mannava Mohanakrishna ) పిలుపునిచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey)లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి లోకేశ్ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని చెప్పారు. యువత ఉపాధి కల్పన, వారిలో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అమెరికా వెళ్లిన ఆయనకు, మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.







