ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం పై క్రేజీ అప్డేట్..
ఆంధ్రాలో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు చంద్రబాబు. ఎన్నికలకు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి. ఎన్నికలు ముగిసి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు చంద్రబాబు తాను చెప్పిన వాగ్దానాలు పూర్తి చేస్తారు అని ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మహిళలకు ఓ శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారిక ప్రకటన కూడా వెల్లడించారు. కూటమి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంది.
తొలుత పెన్షనర్ల విషయంలో తమ హామీని నెరవేర్చుకున్న ప్రభుత్వం ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాల అమల కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు మాటిచ్చినట్లుగా ఉచిత బస్ పథకంపై కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలలో తొలుత ఉచిత బస్సు ప్రయాణం కేటాయించడం వల్ల ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలను మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము.
ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రాలో ఈ పథకం ప్రారంభమైన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే బాబు జీరో టికెట్ విధానం పై రెండు రాష్ట్రాలను అధ్యయనం చేసి.. ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు తీసుకువస్తారని అందరూ భావిస్తున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు మహిళలకు నిజంగానే ఓ మంచి కానుక అందివ్వబోతోంది ప్రభుత్వం అని అందరూ భావిస్తున్నారు.













