సీఎం చంద్రబాబుతో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల భేటి
ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల డిమాండ్లపై సీఎం సానుకూలత
39డిమాండ్లకుగాను 17డిమాండ్లకు సీఎం ఆమోదం
కరెంట్ టారిఫ్ యూనిట్ కు రూపాయి తగ్గింపు
మిగిలిన డిమాండ్ల పరిశీలనకు కమిటి ఏర్పాటు
ఫైర్,మున్సిపల్ సర్టిఫికెట్ల మంజూరులో ఇబ్బందులు తొలగిస్తాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ప్రోత్సహిస్తాం.
ప్రైవేటు పాఠశాలల ఇబ్బందులు పరిష్కరిస్తాం.
విద్యాహక్కు చట్టం ద్వారా సమస్యల పరిష్కారం
ఇంటర్నల్ మార్కుల నిబంధన ఉండదు, కామన్ ఫీజు, ఇండోర్ గేమ్స్ కు ప్రోత్సాహం, ఆన్ లైన్ ద్వారా రికగ్నిజషన్, రెన్యువల్ ఫీజుల చెల్లింపు, ప్రైవేట్ టీచర్ల బోధనా ప్రమాణాల పెంపునకు శిక్షణ, అసెస్ మెంట్ సర్వేలు, సీఎస్ ఆర్ వర్తింపు తదితర 17డిమాండ్లను ఆమోదించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ,‘‘రాష్ట్రంలో 43% విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. బోధనా ప్రమాణాల పెంపునకు చేస్తున్న కృషి అభినందనీయం. ప్రైవేటు పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు మరింతగా పెంచాలి. మెరుగైన ఫలితాలు సాధించాలని’’ కోరారు.
ముఖ్యమంత్రిని కలిసినవారిలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ సంధ్యారాణి, ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజిమెంట్ అసోసియేషన్(అప్స్మా), ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(అప్సా) ప్రతినిధులు పాల్గొన్నారు.













