లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తూ, ఈ వైరస్ చెన్ను తెగగొట్టడంలో విజయం సాధించిన రాష్ట్రాలలో ఆంధప్రదేశ్ మొదటి స్థానం దక్కింది. భారత్‌లో లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటిస్తూ కరోనాను కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ మొదటి స్థానంలో, కేరళ రెండో స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ క్టడికి వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగలేదని ఎన్టీడీవీ పేర్కొంది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ప్రశంసింది. ఎన్టీ టీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని ట్వీట్ చేస్తూ ప్రజలను భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.













