Parthasarathy : ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన
అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి (Parthasarathy) తెలిపారు. విజయవాడ (Vijayawada)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారన్నారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర యువత కలలను అమరావతి (Amaravati) నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకారకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project )కు పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది. సీఎం నాయకత్వంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) సాధ్యమే. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన. అందుకు అనుగుణంగా అందరం కలిసి పని చేస్తాం అని తెలిపారు.













