Amaravati : అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు : నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు (Self-finance project) అని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి (Amaravat)కి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు చేయడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు (World Bank) , హడ్కో (HUDCO) రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) కోడ్ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరుస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం. జగన్ (Jagan) ఆర్థిక విధ్వంసం నుంచి క్రమంగా బయటపడుతున్నాం. గతంలో మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక కేంద్రం నిధులు అనేకం ఆగాయి. మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఒక్కొక్కటీ సరిచేస్తున్నాం. కరకట్టను ఫోర్ లేన్ మార్గంగా మారుస్తాం. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం. నదిని ఆనుకొని రిటైనింగ్ వాల్ నిర్మించాలనేది ప్రణాళిక అని తెలిపారు.













