తిరుమల శ్రీవారి సేవలో మంత్రి లోకేష్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయంలో మంత్రికి తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా జేఈఓ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. అనంరతం ఆలయం వెలుపల మంత్రి నారా లోకేష్ సతీమణి గోమాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు స్థానిక సమస్యలపై పలువురు మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం సమర్పించుకున్నారు. కాగా మంత్రి తిరుగు ప్రయాణంలో జింకల పార్కు వద్ద తన కుమారుడు దేవాన్ష్‌తో కొద్దిసేపు అక్కడే గడిపారు.













