అమరావతిలో ఏఐ వర్సిటీకి సహకరించండి
అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయానికి సలహాలు, సూచనలు అందించి సహకరించాల్సిందిగా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరింగ్ సంస్థ ఎన్ విడియా సహా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించడానికి ఏఐని వినియోగించడం తమ ప్రభుత్వ అభిమతమని ఆయనకు స్పష్టం చేశారు. ముంబయిలో జెన్సన్ హువాంగ్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. లోకేశ్ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ వినియోగంతో అంతర్జాతీయంగా వచ్చే విప్లవాత్మక మార్పుల్ని లోకేశ్‌కు హువాంగ్ వివరించారు. స్పీచ్ రికగ్నైజేషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్‌చైన్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటరింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్‌లను ఎన్ విడియ అందిస్తోంది.













