Nara Lokesh : మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు : మంత్రి లోకేశ్ హెచ్చరిక
మహిళలను కించపరిచేలా వైసీపీ నేత సజ్జల (Sajjala) చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఖండిరచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు (Women) ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల భాషేంటి, వారి ప్రవర్తనేంటి? మహిళలు నిరసన చేస్తే, వైసీపీ నేతలకు తప్పుగా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు (YCP leaders) మహిళలను కించపర్చేలా మాట్లాడుతున్నారు. తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ (Jagan) ను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు? మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.













