మంత్రి లోకేశ్ కు అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన యువ నాయకుల సరసన ఆయనకు స్థానం దక్కింది. ఎపొలిటికల్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి 20 స్థానాల్లో నిలిచిన భారతీయుడిగా లోకేశ్ గుర్తింపు పొందారని పేర్కొంది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వివిధ దేశాల్లోని 35 ఏళ్లలోపు యువ నాయకుల జాబితాను ఎపొలిటికల్ సంస్థ వెల్లడించిందని వివరించింది. కెనడా ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక, బెర్నార్డ్ వాన్లీర్, యూరోపియన్ కమిషన్ భాగస్వామ్యంతో ఈ సంస్థ పని చేస్తోందని మంత్రి కార్యాలయం వెల్లడించింది. 140 దేశాల్లో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించింది.













