ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత .. రెండు కోట్లకు పైగా మహిళలకు

కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా మహిళలకు వ్యాక్సినేషన్ నిర్వహించి మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.84 కోట్ల టీకా డోసులను వేయగా దానిలో 53.75 శాతం మంది మహిళలే ఉన్నారు. కరోనా కేసులు రాష్ట్రంలో స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్‌ను వేగంగా నిర్వహిస్తోంది. రానున్న 40 రోజుల్లో వంద శాతం మందికి టీకా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించి, లక్ష్యాన్ని అధిగమించే దిశగా వైద్యారోగ్య శాఖ సమాయత్తమవుతోంది.