NVIDIA: ఎన్ విడియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
కృత్రిమ మేధ ( ఏఐ)లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా (NVIDIA) తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమక్షంలో ఉన్నత విద్య అధికారులు ఎన్ విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10 వేల మంది విద్యార్థుల (Students)కు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్ (Advanced AI Research Hub)గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది.













