జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సహాయం
పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.













